Home Politics Andhra Pradesh ఆరోగ్యకరమైన ఆహారం అందురూ భుజించాలి

ఆరోగ్యకరమైన ఆహారం అందురూ భుజించాలి

0

– ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం అవసరం
– సమస్త జీవరాశినీ కాపాడుకోవాలి.
– ఏ జీవి అంతరించినా మానవాళికే ముప్పు
– పేరి రామకృష్ణ, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్
ఆరోగ్యకరమైన ఆహారం అందురూ భుజించాలి అని విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరి రామకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం అనకాపల్లి జిల్లా బుచ్చయ్య పేట మండలం లోని కెపి అగ్రహారంలో తాను చేస్తున్న ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం చూసేందుకు వచ్చిన వారితో ఆయన మాట్లాడారు. అయిదు అంచేల విధానం లో భూగర్భ జలాలు పెంపొందించేందుకు కృషి చేస్తూ వ్యవసాయం చేస్తున్నామన్నారు. అనంతరం పంటలూ, గట్టు వ్యవసాయ విధానం అమలు చేస్తున్నామని వివరించారు. ఈ వ్యవసాయం చూస్తూ, పని చేస్తూ ముందుకు వెళ్తేనే అర్థం అవుతుంది అన్నారు. ప్రస్తుతం శీతోష్ణస్థితి వేడెక్కడం వల్ల కలిగే నష్టం అధిగమించడానికి ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం అవసరం అని పేర్కొన్నారు. అలాగే సమస్త జీవరాశినీ కాపాడుకోవాలి అని వివరించారు. పుడమి మీద ఏ జీవి అంతరించినా మానవాళికే ముప్పు ఏర్పడుతుంది అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భారత కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు జలగం కుమారస్వామి మాట్లాడుతూ ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం వల్ల ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది అని వివరించారు. అందుకే తాము జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తున్నామన్నారు. సమస్త జీవరాశినీ కాపాడుకోవాలని ప్రచారం చేస్తున్నామన్నారు. ఈ వేసవిలో సమస్త జీవరాశికి నీరు అందుబాటులో ఉంచాలి అని కోరారు.
ఈ కార్యక్రమంలో మేంగొ మేన్ అప్పాజీ, వారాహి ఫెడరేషన్ ప్రతినిధి రాహూల్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version