Home Politics Andhra Pradesh అందరివాడికి టిడిపిలో అందిలం..

అందరివాడికి టిడిపిలో అందిలం..

0

మండల రథసారధిగా పాడి. వెంకటసుబ్బయ్య యాదవ్.బడుగు బలహీన వర్గాల నేతగా మంచి గుర్తింపు.టిడిపి జెండాని తన అజెండా ముందుకు సాగుతున్న వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. 1982 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా మొదలైన తన ప్రస్థానం నేడు తెలుగుదేశం పార్టీ మండల రథసారథిగా పాడి. వెంకటసుబ్బయ్య ఎన్నిక కాబడడం టిడిపి పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతున్నాయి. 1991లో కురుగొండ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన పాడి వెంకటసుబ్బయ్య 1995లో మొదటిసారిగా ఎంపీటీసీ పదవులు ప్రవేశపెట్టిన సమయంలో ఎంపీటీసీ సభ్యులుగా మొదటి దశలోనే ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో విద్యా కమిటీ చైర్మెన్‌గా , 2001 లో సర్పంచ్ గా , 2009 లో గూడూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా వివిధ హోదాల్లో టిడిపి పార్టీల పని చేసిన పాడి. వెంకటసుబ్బయ్యకు ఓజిలి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పదవి వరించింది.
వివాదాస్పిత రహితుడుగా , ఆదర్శవంతమైన నడవడికతో , ప్రజల పక్షాన నిలిచి, నిస్వార్థ సేవ చేస్తూ ప్రజలకు చేరువైన నాయకుడుగా మంచి గుర్తింపు ఉంది. పాడి. వెంకటసుబ్బయ్యకు మండల అధ్యక్షుడు పదవి వరించడంతో మండలంలో టిడిపి పార్టీకి బలం చేకూరుతుంది. ఓజిలి టీడీపీ మండల అధ్యక్షుడుగా పాడి. వెంకటసుబ్బయ్యను ఎన్నుకోవడంతో టిడిపి పార్టీ అధిష్టానంతో పాటు సూళ్లూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ , టిడిపి ఇన్చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం , ప్రముఖ పారిశ్రామికవేత్త , టిడిపి నియోజకవర్గాల రథసారథి కొండేపాటి గంగా ప్రసాద్ కు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఓజిలి మండలం టిడిపి నూతన అధ్యక్షులు పాడి. వెంకటసుబ్బయ్య యాదవ్ మాట్లాడుతూ టిడిపి అధిష్టానం అప్ప చెప్పిన బాధ్యతను నిబద్ధతతో , నిజాయితీగా నిర్వర్తించి మండలంలో తెలుగుదేశం పార్టీని బలోపేతానికి తన స్థాయి శక్తుల కృషి చేస్తానని పేర్కొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version