Home Politics Andhra Pradesh చంద్రంపాలెం హైస్కూల్ అభివృద్ధికి కృషి: గంటా

చంద్రంపాలెం హైస్కూల్ అభివృద్ధికి కృషి: గంటా

0

రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్థులు చదువుతున్న చంద్రంపాలెం హైస్కూల్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. సోమవారం హైస్కూల్ ను సందర్శించారు. విద్యార్థులు ఆడుకునే గ్రౌండ్ లో వర్షపు నీరు నిలవకుండా ఒకటి, రెండు రోజుల్లో చేపట్టబోయే పనులు స్కూల్ పునః ప్రారంభం నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలన్నారు. విద్యార్థులు భోజనం చేయడానికి వీలుగా స్కూల్లో డైనింగ్ హాల్ సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా స్కూల్లో సెక్యూరిటీని పటిష్టం చేసి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. దీంతో పాటు పోలీస్ పెట్రోలింగ్ తో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని పేర్కొన్నారు. హైస్కూల్ నీటి అవసరాల కోసం బోరు తవ్వించడంతో పాటు మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వాలని.. సంప్ ఏర్పాటు చేయాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. స్కూల్లో స్టేజ్ కావాలని హెడ్ మాస్టర్ కోరగా పరిశీలిస్తామని గంటా తెలిపారు. కార్యక్రమంలో యువ నాయకుడు గంటా రవితేజ, రీజనల్ జాయింట్ డైరెక్టర్ విజయ్ భాస్కర్, సమగ్ర శిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరక్టర్ చంద్రశేఖర్, డిప్యూటీ డీఈఓ సోమేశ్వరరావు, జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, హెడ్ మాస్టర్ ఎం. వెంకట్రావు, సమగ్ర శిక్ష ఈఈ నరసింహారావు, డీఈలు మణికుమార్, సురేష్, డిప్యూటీ తహసీల్దార్ రాజేష్, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, మొల్లి లక్ష్మణరావు, యార్లగడ్డ జీవన్ కుమార్, కె. అచ్యుతరావు, మాన్యాల సోంబాబు, పిల్లా వెంకట్రావు, వాండ్రాసి అప్పలరాజు, నాగోతి సత్యనారాయణ, మామిడి దుర్గారావు, బోయి రమాదేవి, దివీస్ మేనేజర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version