Friday, May 1, 2026
HomeNewsఏజెన్సీలో భూ ప్రకంపనలు

ఏజెన్సీలో భూ ప్రకంపనలు

3 సెకన్ల పాటు కంపించిన భూమి

భయంతో పరుగులు తీసిన జనం

ఆంధ్ర ఊటీ అరకు లోయతో పాటు పాడేరు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. శనివారం రాత్రి 11.31 నిమిషాలకు ఈ భూ ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ఇళ్లలోని సామాన్లన్నీ చెల్లచెదురుగా పడిపోయాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలోని ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రత 4.4గా ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఓడిశాలోని కోరాపుట్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ముంచంగిపుట్, హుకుంపేట, జోలాపుట్, సుజన్‌కోట తదితర ప్రాంతాల్లో సైతం భూమి కంపించినట్లు తెలుస్తోంది. గతంలో ఈ ప్రాంతంలో ఎప్పుడూ భూకంపం రాలేదని స్థానికులు చెబుతున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments