Home Politics Andhra Pradesh భూమి ఎంటర్ప్రైజెస్ మ్యాగజైన్ తనిఖీ చేసిన డిఎస్పి

భూమి ఎంటర్ప్రైజెస్ మ్యాగజైన్ తనిఖీ చేసిన డిఎస్పి

0

రావికమతం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమీర గ్రామంలో ఉన్న మిసెస్ భూమి ఎంటర్ప్రైజెస్ మ్యాగజైన్‌ను మంగళవారం అనకాపల్లి డిఎస్పి శ్రావణి , కొత్తకోట సిఐ, ఎస్సై కూడిన బృందo తనిఖీ నిర్వహించింది.
మ్యాగజైన్‌కు 2030 వరకు చెల్లుబాటు అయ్యే పిఈఎస్ఓ లైసెన్స్ ఉన్నట్టు గుర్తించం.మ్యాగజైన్ గ్రామంలోని పొలాల్లో, నివాస ప్రాంతాలకు ప్రధాన రహదారికి దూరంగా ఉందన్నారు.
నైట్రోజన్ మిశ్రమం, డెటోనేటర్లు ఫ్యూస్ వైర్ అనుమతించబడిన పరిమితులలో ఉన్నాయన్నారు.
.గ్రౌండ్ స్టాక్ పుస్తకo పరిశీలించగా స్టాక్‌తో సరిపోయిందన్నారు.
మ్యాగజైన్ ప్రాంగణంలో ఎలాంటి విద్యుత్ లైన్లు లేదా విద్యుత్ కనెక్షన్ లేదనీ, పైకప్పుపై మూడు లైట్నింగ్ కండక్టర్లు ఏర్పాటు చేయబడ్డాయన్నారు.
అగ్ని ప్రమాద నియంత్రణ చర్యలుగా నీటి గుంతలు, ఇసుక బకెట్లు, నీటి బకెట్లు ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ప్రాంగణంలో అందుబాటులో ఉన్నాయన్నారు.
సామగ్రి రవాణా కోసం రెండు వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అవి ప్రత్యేకంగా తయారు చేయబడి, చెల్లుబాటు అయ్యే పి ఈ ఎస్ ఓ లైసెన్సులు కలిగి ఉన్నాయన్నారు. డ్రైవర్లు హాజర్డస్ గూడ్స్ డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉన్నారు. రెండు షాట్ ఫైరర్లు ఒక ఫోర్‌మాన్ ఉన్నారు వీరందరూ చెల్లుబాటు అయ్యే పి ఈ ఎస్ ఓ లైసెన్సులు కలిగి ఉన్నారనీ చెప్పారు.
మ్యాగజైన్ చుట్టూ కంచె ఏర్పాటు చేసి భద్రతా సిబ్బందితో సముచితంగా నిర్వహించబడుతోందనీ ఎటువంటి సమస్యలు లేవన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version