Home News ఆదివాసులపై దాడులు జరిగిన కూటమి ప్రభుత్వం పట్టించుకోదా?

ఆదివాసులపై దాడులు జరిగిన కూటమి ప్రభుత్వం పట్టించుకోదా?

0

గిరిజనులపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసిన నమోదు కాని ఎఫ్ఐఆర్

పెత్తందారులకు కొమ్ము కాస్తున్న కూటమి ప్రభుత్వం

కూటమి ప్రభుత్వంపై నిప్పులు చేరిన ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్

చింతపల్లి మండలం జలగలగెడ్డ గ్రామానికి చెందిన గిరిజనులపై జరిగిన పెత్తందార్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర పేర్కొన్నారు. ఆదివాసీలపై దాడికి పాల్పడ్డ బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులపై దాడి చేసిన వారిపట్ల పోలీసులు ప్రేమ చూపుతుండడం సరికాదని బాధ్యులను వెంటనే అరెస్టు చేయకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. జలగలగెడ్డ గిరిజనులపై జరిగిన దాడిని ఖండిస్తూ బుధవారం ఆమె పత్రికా ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆదివాసీలకు భద్రత లేదని పెత్తందారులు దాడులు చేస్తుంటే ప్రభుత్వం వాళ్లకు అండగా ఉండడం సరికాదన్నారు. తమపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా తాత్సారం చేయడమే కూటమి ప్రభుత్వంలో గిరిజనులకు రక్షణ లేదనడానికి ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు. తమకు రక్షణ కల్పించండి అని ధర్నా చేస్తున్న సరే కనీసం కూటమి ప్రభుత్వంలో స్పందన లేకపోవడం దుర్మార్గమన్నారు. ఆదివాసీలు అంటే గొప్ప గొప్ప ప్రసంగాలు దంచికొట్టే నాయకులంతా ఈరోజు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. పెత్తందారులకు కొమ్ము కాస్తూ ఆదివాసిలపై దాడులు చేయడానికి ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి దాడికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని మంజూరు చేసిన రోడ్డును వెంటనే నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version