Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshఇష్టమొచ్చినట్టు రోడ్లు తవ్వేస్తారా!

ఇష్టమొచ్చినట్టు రోడ్లు తవ్వేస్తారా!

అండర్ గ్రౌండ్ కేబుల్ పనులపై గంటా ఆగ్రహం*

ఇష్టం వచ్చినట్టు రోడ్లు తవ్వేసి వదిలేస్తారా! మీ నిర్వాకానికి ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉండాలా!? అని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ కాంట్రాక్టర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎం పాలెంలో విద్యుత్ కేబుల్స్ కోసం గొయ్యిలు తీసి వదిలేసిన ప్రాంతాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. నగరంలో కేబుల్స్ కోసం తవ్వేసిన గోతులను నెలల తరబడి వదిలేస్తున్నారని, ప్రజలు నడవడానికి.. వాహనాల మీద వెళ్లడానికి అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. 15 రోజుల్లో పూడ్చగలిగితేనే గోతులు తీయాలని, ఊరంతా తవ్వి నచ్చినప్పుడు పనులు పూర్తి చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. సామర్థ్యాన్ని మించి పనులు ప్రారంభిస్తే ఇలానే ఉంటుందని అసహనం వ్యక్తం చేశారు. పీఎం పాలెంలో గొయ్యి తవ్వి నెల రోజులు దాటిపోయిందని, ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఇష్టానుసారం తవ్వేసి వదిలేసినా.. గొయ్యి సరిగా కప్పకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బందుల పాల్చేస్తున్న ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని జీవీఎంసీ జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడును.. ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సింహాచలం నాయుడును ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిరణ్ కుమార్, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, మాన్యాల సోంబాబు, గరే గుర్నాథ్, లొడగల అప్పారావు, జానకిరామ్, కానూరు అచ్యుతరావు, పాసి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments