Home Politics Andhra Pradesh రాజుపాలెం గ్రామంలో రథసప్తమి వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా

రాజుపాలెం గ్రామంలో రథసప్తమి వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా

0

అనకాపల్లి మండలం రాజుపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఈనెల 25వ తేదీ రథసప్తమి వేడుకలుకు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా రాజుపాలెం సూరి నారాయణమూర్తి దేవాలయం సందర్శించి పరిశీలించడం జరిగింది. ఆయనకు రాజుపాలెం గ్రామస్తులు దేవాలయ పాలకవర్గ సభ్యులు సాదరంగా ఘనంగా స్వాగతం పలకడం జరిగింది పాలకమండ సభ్యులు వీరిని ఆలయంలో తోడుకొని వెళ్లి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రాజుపాలెం కొండపై వెలసి ఉన్న స్వామివారి ఆలయ ప్రాంగణం అంతా ఆయన పరిశీలించడం జరిగింది. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను అక్కడ వారిని కమిటీ సభ్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది. పోలీస్ బందోబస్తు అలాగే సిసి టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రద్దీన్ పర్యవేక్షించేందుకు డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచాలని ఆయన వారి సిబ్బందికి అక్కడ వారికి సూచించడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం ఇబ్బంది లేకుండా పరిసర ప్రాంతాలు మంచినీటి వసతి వైద్య సదుపాయం వాహనాలు పెట్టుకునే పార్కింగ్ సదుపాయం క్యూ లైన్ లో సరిపడా విద్యుత్తు దీపాలు అన్ని సక్రమంగా ఉన్నాయో లేదో సమీక్షించుకోవాలని దానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలని వచ్చే భక్తులకు ప్రశాంత వాతావరణంలో స్వామివారి దర్శనం జరిగేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు. భారీ వాహనాలు లోపటికి రాకుండా వాటిని వేరే మార్గం గుండా మళ్లించే ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించడం జరిగింది. క్యూలైన్లో వాలంటరీలు, పోలీసులు కలిసి భక్తులుకు తొందరగా స్వామివారి దర్శనం అయ్యేలా చూడాలని ఆయన సూచించారు. జిల్లా ఎస్పీ సమీక్ష కార్యక్రమంలో ఎం శ్రావణి (సబ్ డివిజన్ డి.ఎస్.పి) ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, వెంకటనారాయణ, ప్రేమ్ కుమార్, స్వామి నాయుడు, ఎస్సై రవికుమార్ ఆలయ కమిటీ సభ్యులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భక్తుల భద్రత ధ్యేయంగా ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేసి రథసప్తమి వేడుకలు ఘనంగా విజయవంతం చేయాలని ఎస్పీ పిలుపునివ్వడం జరిగింది

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version