మహిళలు ఆందోళన –
రావికమతం మండలం కొత్తకోట మేజర్ పంచాయతీ కేంద్రంలో దేవత అమ్మ వీధి. తో పాటు మరో రెండు కాలనీలో 200 దళిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. పంచాయతీలకు ప్రతి ఇంటికి హౌస్ టాక్స్ చెల్లిస్తున్నారు అయినా మంచినీరు ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు
పబ్లిక్ కుళాయిలు వేసి నాలుగు సంవత్సరాలు అవుతుంది. ఇంటింటికి కుళాయిలు వేసి మూడు సంవత్సరాలు అవుతుంది. కుళాయిలు విగ్రహ ఉత్సవాలుగా ఉన్నాయి తప్పా నీళ్లు రావడం లేదు
జల్జీవన్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 6 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు. ఇంటింటకోలాయిలు ఏర్పాటు చేశారు. 15 రోజులు నీళ్ళు ఇచ్చారు. తర్వాత నీరు ఇవ్వలేదు. రెండు రోజులకి ఒకసారి స్నానం చేయవలసిన పరిస్థితి. నీళ్ల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి నీళ్లు ఆడుకునే పరిస్థితి. మా పరిస్థితి ఎప్పుడు బాగుపడతాయి. ప్రతి ఊర్లో బ్రాందీ షాపులు ఉన్నాయి. బ్రాందీకి కరువు లేదు. నీరు కోసం అనేకసార్లు ఇబ్బందులు పడుతున్నాము. గతంలో అనేకసార్లు ఆందోళన చేసిన. రెండు ట్రాక్టర్లు నీరు తీసుకువచ్చి. ఫోటోలు తీసుకొని ప్రచారం చేస్తున్నారు తప్పా . వాస్తవానికి కుళాయిల్లో నీళ్లు రావడం లేదు. కొత్త ట్యాంకు నిర్మాణం పూజ చేశాము. త్వరలోనే నీరు ఇస్తామని చెబుతున్నారు. కానీ నీరు ఇప్పటికీ కూడా ఇవ్వడం లేదు. రావికమతం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో దళిత మహిళలు ఆందోళన నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది
ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు. దళిత మహిళలు ఈశ్వరమ్మ. కె లావతల్లి. కళ్యాణి. పెద్దమ్మలు తదితరులు పాల్గొన్నారు.
