Home Politics Andhra Pradesh వసతి గృహ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

వసతి గృహ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

0

టీడీపీ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో వసతి గృహ విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. ఆదివారం ఉదయం ఎం వి పి కాలనీ సెక్టార్ 4 లోని సాంఘీక సంక్షేమ శాఖ కి చెందిన బాలుర వసతి గృహంలో జరిగిన కార్యక్రమంలో వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ , ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కుమారుడు వెలగపూడి ప్రతాప్ రుద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం సంక్షేమ వసతి గృహంలో విద్యార్థుల మధ్య నిర్వహించటం ఆనందంగా ఉందన్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక టీడీపీ పార్టీ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. అన్న నందమూరి తారక రామారావు ఆనాడే సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వటంలో పాటు ప్రతీ ఒక్కరికీ కూడు గూడు గుడ్డ ఉండాలి అనే నినాదంతో పార్టీ నీ బడుగు, బలహీన వర్గాలకు చేరువ చేశారని తెలిపారు. అన్న నందమూరి తారక రామారావు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. అనంతరం వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ , వెలగపూడి ప్రతాప్ రుద్ర తో కలిసి విద్యార్థులను పుస్తకాలు, పెన్నులు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెక్కంటి సత్తిబాబు, గేదెల నాగరాజు, ఎ.రమేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version