ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరకు వేలి లో ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ కె భరత్ కుమార్ నాయక్ సూచనల మేరకు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి కొండబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక సీఐ ఎల్ హిమగిరి ఎస్సై జి గోపాల్ రావు చేతుల మీదుగా సుమారు 400 మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పిఓ లు పి నాగబాబు, వై విజయలక్ష్మి,ఎం అనిత కుమారి అధ్యాపకులు ఎల్ ఎం ఎస్ గణేష్,బి లచ్చన్న విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
