గత రెండు సంవత్సరాలుగా పేద మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తూ స్వయం ఉపాధికి తోడ్పడే కుట్టు మిషన్ల శిక్షణా శిబిరాన్ని కొనసాగిస్తూ వాళ్ళ నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్న గుంటూరు ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు.
ఈనెల 12వ తేదీ గుంటూరులోని అంకమ్మ నగర్ లో కోవిడ్ ఫైటర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ల శిక్షణా శిబిరాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, శాసనమండలి మాజీ సభ్యులు కె.ఎస్ లక్ష్మణరావు సంయుక్తంగా ప్రారంభించారు.
కె.ఎస్ లక్ష్మణరావు ప్రసంగిస్తూ మానవ సేవే మాధవ సేవగా భావించి కోవిడ్ ఫైటర్స్ నేటికి 11 లక్షల మందికి అన్నదానం చేయడం, నిరుపేదలైన రోగులకు, క్షతగాత్రులకు ఉచితంగా అంబులెన్స్ సౌకర్యం కల్పించడం హర్షణీయమన్నారు.
డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ కోవిడ్ సమయంలో 40 మంది ముస్లిం యువతతో ప్రారంభమైన కోవిడ్ ఫైటర్స్ నేటికీ 6 వేలకు పైగా అనాధ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ మంచితనానికి, మానవత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారన్నారు.
జన చైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ దాదాపు 10 లక్షల జనాభా ఉన్న గుంటూరు నగరంలో టైలరింగ్ శిక్షణతో నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా స్వయం ఉపాధి సాధించవచ్చని తెలిపారు. కోవిడ్ ఫైటర్స్ ఇతర స్వచ్ఛంద సంస్థలకు ఆదర్శంగా నిలుస్తూ గుంటూరు నగర ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని పొందిందని ప్రశంసించారు.
. ఈ కార్యక్రమంలో నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు జలీల్ అహ్మద్, జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయ రెడ్డి, కోవిడ్ ఫైటర్స్ నేతలు పటాన్ అల్లాబక్షు, పఠాన్ ముజీబ్, పఠాన్ హుస్సేన్ ఖాన్, టోపీ బాబు, ట్రైనర్ షేక్ అయేషా, మేకల రామారావు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఈ
