Home Politics Andhra Pradesh యస్‌సి కులంపై అనుచిత వ్యాఖ్యలు ఖండన – ఆదిరెడ్డి అప్పారావు పై తీవ్ర విమర్శలు

యస్‌సి కులంపై అనుచిత వ్యాఖ్యలు ఖండన – ఆదిరెడ్డి అప్పారావు పై తీవ్ర విమర్శలు

0

యస్‌సి కులంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పై వైఎస్సార్‌సీపీ యస్‌సి విభాగ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. రాజమండ్రి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో యస్‌సి విభాగం అధ్యక్షుడు తిరగాటి దుర్గ ఆధ్వర్యంలో సోమవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, సమకాలీన రాజకీయాలలో యస్‌సి వర్గాల పాత్ర అత్యంత కీలకమని, అలాంటి వర్గాన్ని చులకనగా మాట్లాడటం తీవ్రంగా ఖండనీయమన్నారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఆడియోలో యస్‌సి కులంపై చేసిన వ్యాఖ్యలు వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహానుభావుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను అవమానించినట్లేనని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడిగే నాయకులు, తర్వాత అదే వర్గాలపై వివక్ష చూపడం దురదృష్టకరమని విమర్శించారు. “దళితులను ఇళ్లలోకి రానివ్వకూడదా? ఉద్యోగాలు తీసివేయిస్తామని బెదిరించడమా? ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం కాదా లేక వ్యక్తిగత జాగీరా?” అంటూ ప్రశ్నించారు.
దళిత ఉద్యోగిపై బెదిరింపులకు పాల్పడ్డారని, జాన్ అనే దళితుడిపై దాడి జరిగిన వీడియోలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ విషయాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. యస్‌సి, యస్‌టిపై అట్రాసిటీ కేసులతో పాటు హత్యాయత్నం (సెక్షన్ 307) కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ జాతి పిత స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యస్‌సి విభాగ అధికార ప్రతినిధి కాటం రజనీకాంత్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరే చిన్ని, సీనియర్ నాయకులు మార్తి నాగేశ్వరరావు, దాసి వెంకటరావు, గారా చంటి, సోడదాసి సుందర్ సింగ్, మత్తల వినోద్, పులి సాగర్, జొన్నాడ విల్సన్, బాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version