Home News రెవిన్యూ సదస్సు, గ్రామ సభలలో వచ్చిన ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి-జాయింట్ కలెక్టర్

రెవిన్యూ సదస్సు, గ్రామ సభలలో వచ్చిన ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి-జాయింట్ కలెక్టర్

0

పాడేరు,జయ జయహే :- గ్రామ సభలో, రెవెన్యూ సదస్సులలో వచ్చిన ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని ఇంచార్జి జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజా, సహాయ కలెక్టర్ సాహిత్ తో కలిసి బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాడేరు డివిజన్ కి సంబంధించిన రెవిన్యూ సమస్యలపై మండల తహసీల్దార్స్, డిప్యూటీ తహసీల్దార్స్, రెవిన్యూ ఇన్స్పెక్టర్స్ తో సమావేశం నిర్వహించారు.

ఆయా మండలాలలో జరిగిన గ్రామం సభలు, రెవిన్యూ సదస్సు లలో వచ్చిన భూ సమస్యలు,రీ సర్వే, కుల ధ్రువ సర్టిఫికెట్లు జారీ, కుటుంబ, ఇతర సమస్యల పై వచ్చిన ఫిర్యాదులను పిటిషన్ దారునితో మాట్లాడి సమస్యను
వివరించి పరిష్కరించాలి. తాహిసీల్దార్ పరిధిలో కాలేజీ, స్కూల్ పిల్లలకు సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రాలు, పంచనామా సర్టిఫికెట్స్ ఏ ఇతర సర్టిఫికెట్స్ పెండింగ్ లేకుండా సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. తమ పరిధిలో పరిష్కారము కాని ఫిర్యాదుదారుని సమస్యలు జాయింట్ కలెక్టర్, ఆర్డిఓలకు తెలియజేసి పరిష్కరించి సమస్య వెబ్సైట్ పోర్టర్ లో నమోదైన సంఖ్య లేకుండా చూడాలన్నారు. పి జి ఆర్ ఎస్ గ్రీవెన్స్ పోర్టర్ లో పిటిషన్లు పునరావృతం జరగకుండా వచ్చిన పిటిషన్స్ ను చదివి అవగాహన తెచ్చుకుని పిటిషన్ దారానికి పరిష్కారం చూపాలన్నారు.

ఈ సమావేశం లో రెవెన్యూ డివిజనల్ అధికారి విఎస్ లోకేశ్వరరావు, జిల్లా రెవిన్యూ అధికారి అంబేద్కర్ రెవిన్యూ సిబ్బంది పాల్గున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version