యలమంచిలి, జయ జయహే న్యూస్ : సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న పేదల కుటుంబాలలో వెలుగులు నిండుతాయని మాజీ ఎంపీ పప్పల చలపతిరావు అన్నారు. శుక్రవారం అచ్చుతాపురం మండలం కాజీపాలెం గ్రామానికి చెందిన అప్పికొండ నాయుడు కుమారుడుకు ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడని తెలుసుకొని రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, యలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ చూపి సీఎం సహాయ నిధి నుండి 10 లక్షల రూపాయల ఎల్ఓసిని మాజీ పార్లమెంటు సభ్యులు పప్పల చలపతిరావు చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యలమంచిలి నియోజకవర్గ పరిచర్యకులు బోండా జగన్నాథం, రాష్ట్ర కార్యదర్శి రాజన రమేష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి, యాదవ కార్పొరేషణ్ డైరెక్టర్ ధూళి రంగనాయకులు, మండల అధ్యక్షులు పీలా తులసీరామ్, లాలం శ్రీ భరత్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మామిడి శివ అప్పారావు, కాండ్రేగుల సూర్యనారాయణ, పిఏసిఎస్ చైర్మన్ దేశం శెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
