Tuesday, April 21, 2026
HomePoliticsAndhra Pradeshఘనంగా సీఎం రమేష్ జన్మదిన వేడుకలు

ఘనంగా సీఎం రమేష్ జన్మదిన వేడుకలు

మండలంలోని వడ్డాదిలో బుధవారం బిజెపి నేతలు ఎంపీ సీఎం రమేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.స్థానిక మసీద్‌, దేవాలయాలలో ఎంపీ పేరిట ప్రార్థనలు,పూజలు జరిపారు.అంతకు ముందు స్థానిక ఆసుపత్రులలో రోగులకు పండ్లు, రొట్టెలు అందజేశారు.కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు.ఎంపీ సీఎం రమేష్ ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎంపీ సారథ్యంలో అనకాపల్లి జిల్లా సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తుందన్నారు.మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాబాజీ,జిల్లా నాయకులు దూది రాజేష్, మండల బిజెపి అధ్యక్షుడు సీతా నాగరాజు,కార్యదర్శి దొండా నానాజీ,కిసాన్ మోర్చా జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఈశ్వరరావు,జిల్లా సోషల్ మీడియా కో-కన్వీనర్ మణికంఠ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments