అల్లూరి జిల్లా అనంతగిరి మండలం ఎన్ ఆర్ పురం పంచాయతీ పరిధిలో 16 గిరిజన గ్రామాల ప్రజలకి 1975లో సుమారు 500 కుటుంబాలకు ప్రభుత్వం వారు డి పట్టలు ఇచ్చారని. మధ్యకాలంలో ఫారెస్ట్ అధికారులు వచ్చి అది ఫారెస్ట్ ల్యాండ్ అని ప్రభుత్వ భూమి కాదని రైతులను అన్నట్లు తెలిపారు. అదే విషయం పట్ల జిల్లా అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలను అందజేస్తూ ఎన్ ఆర్ పురం పంచాయతీ కి రీ సర్వే చేసి వారికి ఇచ్చిన డి పట్టాలను రెవెన్యూ పరిధిలో తీసుకుని ప్రీ హోల్డ్ చేసి జిరాయితి గా భూమిని అప్పగిస్తారని కోరారు. ఇప్పుడిప్పుడే ఈ ఎన్ ఆర్ పురం పంచాయతీ టూరిజం డెవలప్మెంట్ అవుతున్న సమయంలో వారికి ఉపాధి కలుగుతున్న తరుణంలో సుమారు 50 ఏళ్ల తర్వాత ప్రభుత్వ భూమి ని ఫారెస్ట్ భూమి అనడం భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఎన్ ఆర్ పురం పంచాయతీ నాన్ షెడ్యూల్ అవ్వడం వలన ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ డి పట్టాలు కూడా ఫారెస్ట్ భూమి అంటే ఇంకా ఇబ్బందులకు గురి అవుతామని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ రీ సర్వే చేసి వారికి ఇచ్చిన డి పట్టా ప్రభుత్వ భూమిని ప్రీ హోల్డ్ చేసి వారికి అప్పగించాలన్నారు. ప్రభుత్వానికి ఎన్ ఆర్ పురం గిరిజన రైతులు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మజ్జి గెడ్డయ్య . తుమ్మి అప్పలరాజు దొర గిరిజన నాయకులు.స్థానిక గిరిజనులు పాల్గొన్నారు.
