Home News ఘనంగా బాలల దినోత్సవ వేడుకులు

ఘనంగా బాలల దినోత్సవ వేడుకులు

0
  • ఘనంగా బాలల దినోత్సవ వేడుకులు

దేవరాపల్లి, జయజయహే :

మండలంలోని అన్ని పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా సమ్మెద స్కూల్ కమిటీ చైర్మన్ కొమ్ము శివ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు నిర్వహించారు.విద్యార్థులు చాచా నెహ్రూ వేషధారణలో వస్త్రాలు ధరించి ఆకర్షించారు. ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ చిట్టి పొట్టి చిన్నారులకు స్వాతంత్ర భారత తొలి ప్రధాని, స్వతంత్ర సమరయోధుడు, రచయిత పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని ఆయన మరణానంతరం 1964లో భారత్ ప్రభుత్వం బాలల దినోత్సవం గా ప్రకటించిందని నెహ్రూకి పిల్లలంటే అమితమైన ప్రేమని, పిల్లలు కూడా వారిని చాచా నెహ్రూ అని ముద్దుగా పిలిచేవారని నెహ్రూ చరిత్రను ఉపాధ్యాయులు చిన్నారులకు వివరించారు. చిన్నారులను నెహ్రూ విశేషంగా ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అప్పలనాయుడు, ఉపాధ్యాయురాలు ఎం. బి రత్నం తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version