Home Politics Andhra Pradesh విద్యార్థులకు ఊరట…

విద్యార్థులకు ఊరట…

0

ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలకు మంజూరు రాష్ట్రంలోని విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1200 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం కారణంగా కోట్లాది రూపాయల ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. ఈ బకాయిల కారణంగా అనేక మంది విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిందని, అందులో భాగంగానే ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు చర్యలు చేపట్టిందని చెప్పారు. ఈ మొత్తాన్ని నేరుగా కళాశాల యాజమాన్య ఖాతాల్లోకి జమ చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు.
ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసిన మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో విద్యార్థులపై ఉన్న ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, విద్యా వ్యవస్థపై నమ్మకం మరింత బలపడుతుందని వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ స్పష్టం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version