Home News ఘ‌నంగా 76వ భార‌త రాజ్యాంగ దినోత్స‌వం

ఘ‌నంగా 76వ భార‌త రాజ్యాంగ దినోత్స‌వం

0

పాడేరు జయ జయహే  :-
76 వ భార‌త రాజ్యాంగ దినోత్స‌వం బుధ‌వారం ఉదయం ఐ టి డి ఏ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా. బి ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఐ టి డి ఏ సహాయ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర రావు. అనంతరం ఐ టి డి ఏ పరిపాలన అధికారిని హేమలత, కార్యాలయ సిబ్బంది తో పాల్గొని ప్లేడ్జి నిర్వహించారు. భార‌త‌దేశ‌ ప్ర‌జ‌ల‌మైన మేము భార‌త‌దేశాన్ని స‌ర్వ‌స‌త్తాక‌, సామ్య‌వాద‌, లౌకిక‌, ప్ర‌జాస్వామ్య‌, గ‌ణ‌తంత్ర రాజ్యముగా నిర్మించుకోవ‌డానికి పౌరులంద‌రికీ సాంఘిక‌, ఆర్థిక‌, రాజ‌కీయ న్యాయాన్ని, ఆలోచ‌న‌, భావ‌ప్ర‌క‌ట‌న‌, విశ్వాస‌ము, ధ‌ర్మ‌ము, ఆరాధ‌న‌ల‌లో స్వేచ్ఛ‌ను, అంత‌స్తు లోను, అవ‌కాశ‌ములోను స‌మాన‌త్వ‌మును చేకూర్చుట‌కు మ‌రియు వారంద‌రిలో వ్య‌క్తి గౌర‌వ‌మును, జాతి ఐక్య‌త‌ను మ‌రియు అఖండ‌త‌ను త‌ప్ప‌క సంర‌క్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుట‌కు స‌త్య‌నిష్టాపూర్వ‌కముగా తీర్మానించుకొని 26 న‌వంబ‌రు 1949న మ‌న రాజ్యాంగ‌ప‌రిష‌త్తులో ప‌రిగ్ర‌హించి శాస‌నంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము స‌మ‌ర్పించుకుంటున్నాము….అని ప్ర‌తిజ్ఞ చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో గ్యాస్ మేనేజర్ శ్రీనివాస్ (ఐ టి డి ఏ),డి ఎం అండ్ హెచ్ ఓ కార్యాలయ జె ఏ డి. మాదిరి,వివిధ విభాగల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version