Home Politics Andhra Pradesh వజ్రం కిషోర్ ను పరామర్శించిన బొజ్జల బృందమ్మ

వజ్రం కిషోర్ ను పరామర్శించిన బొజ్జల బృందమ్మ

0

పట్టణ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి, నందమూరి అభిమాన సంఘం రాష్ట్ర నాయకుడు వజ్రం కిషోర్ పై పెనుబాక గ్రామంలో వైసీపీ మూకలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తల్లి బృందమ్మ శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ లో పరామర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతల పరిరక్షణకు సీఎం చంద్రబాబు నాయుడు కఠిన చర్యలు తీసుకుంటున్నా, వైసీపీ అల్లరి మూకలు ఇంకా ‘రప్పా..రప్పా’ నినాదాలతో రెచ్చిపోతూ ప్రశాంతతకు విఘాతం కలిగిస్తున్నారని అన్నారు.ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే,సహించలేక వైసీపీ శక్తులు చేస్తున్న ఇటువంటి దాడులపై పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ నేపథ్యంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వజ్రం కిషోర్ ను బొజ్జల బృందమ్మ, టీడీపీ నాయకులు పరామర్శించి, బాధితుడికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version