Home Politics Andhra Pradesh అంజనీపుత్ర చిరంజీవివాకర్స్ క్లబ్స్’ ఆధ్వర్యంలో రక్త పరీక్షలు

అంజనీపుత్ర చిరంజీవివాకర్స్ క్లబ్స్’ ఆధ్వర్యంలో రక్త పరీక్షలు

0

అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ నడక మైదానంలో క్వీన్స్ ఎన్.ఆర్.ఐ. హాస్పిటల్ సౌజన్యంతో బి.పి.షుగర్ పరీక్షలను క్లబ్ అధ్యక్షులు సి.హెచ్ రమణ నెలవారీ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ ఎ. తిరుపతి రావు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతీ ఒక్కరు తరుచుగా బి.పి, షుగర్ పరీక్షలను చేసుకోవాలని,ఆహార నియమాలను పాటించడం అవసరమని, ప్రజలంతా ఉప్పు వాడకాన్ని తగ్గించుకొని బిపి ను నియంత్రణలో ఉంచుకోవాలని, ఉదయాన్నే నడుస్తూ, వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని సూచిస్తూ.. మనం బాగుంటే సమాజం బాగుంటుందని, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ చేస్తున్న సేవలను కొనియాడారు.

క్వీన్స్ ఎన్.ఆర్. ఐ, పి.ఆర్. ఒ. సి.హెచ్. మోహనరావు, టెక్నీషియన్లు కుమారి లిఖిత,ప్రసాద్ సేవలందించిన ఈ శిబిరంలో సుమారు వందమంది ప్రజలు వైద్య సేవలను వినియోగించు కున్న ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ 102 ఏరియా కోఆర్డినేటర్ డాక్టర్ ఎ. ఎస్. ప్రకాశరావు మాష్టారు, డిప్యుటీ గవర్నర్ తాడ్డి ఆదినారాయణ,బాలాజీ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీమాన్ శ్రీనివాసరావు, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు), జాలీ వాకర్ వై. నలమహారాజు, క్లబ్ ఉపాధ్యక్షులు పెనుమత్స అప్పలరాజు, జి. సూర్యప్రకాశరావు ఎస్సై, క్లబ్ కార్యదర్శి కోట్ల ఈశ్వరరావు,జాయింట్ కార్యదర్శి ఇందుకూరి అప్పలరాజు,యోగా గురువు సాలూరు చక్రధర్ పట్నాయక్,క్లబ్ పెద్దలు కోట్ల సత్యనారాయణ,ఆర్. సి. హెచ్. అప్పలనాయుడు, ఎన్. రమేష్ బాబు, గురుమూర్తి, టి.ఎన్.ఎం. రాజు, సభ్యులు భారీగా పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version