– బెడ్ రోల్స్ సరఫరా దారులతో అదనపు డి ఆర్ ఎం రామారావు
– విశాఖ రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీ
విశాఖపట్నంలో ప్రారంభమయ్యే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వాల్టేరు ఆపరేషన్స్ డి ఆర్ ఎం కె. రామారావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఆన్‌బోర్డ్ హౌస్ కీపింగ్ సిబ్బంది, సరఫరా చేసే లినెన్, బెడ్ రోల్స్ పరిశుభ్రత, సిబ్బంది ప్రవర్తనా విధానంపై దృష్టి సారించారు. క్లీనింగ్ సిబ్బంది, లినెన్ సరఫరాదారులతో సంభాషించారు. సిబ్బంది ప్రయాణికులతో ఎలా ప్రవర్తించాలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రయాణీకులకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించాలని, ప్రయాణీకులతో మర్యాదగా మాట్లాడాలని, లినెన్ సరఫరా పరిశుభ్రతకు సంబంధించిన ప్రయాణీకుల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని సూచించారు, తద్వారా వారి ప్రయాణం సౌకర్యవంతంగా మరియు చిరస్మరణీయంగా మారుతుందన్నారు.
