Home Politics Andhra Pradesh భగవాన్ రామదూత స్వామిని దర్శించుకున్న బి.వి.రామ్

భగవాన్ రామదూత స్వామిని దర్శించుకున్న బి.వి.రామ్

0

ప్రపంచ యుద్ధాలు నిలిచిపోయి శాంతి నెలకొనాలని ఆకాంక్ష

రామదూత స్వామివారు 43వ అవధూతగా, దత్తాత్రేయ పరంపరలో విశ్వశక్తి స్వరూపంగా గుర్తింపు పొందారు ఆయనను తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ దర్శించుకున్నారు. ఋషికొండ సమీపంలోని వేంచేసి ఉన్న రామ దూత స్వామి ని ఆదివారం కలుసుకున్నారు. అనంతరం బి.వి.రామ్ మాట్లాడుతూ.. ఆయనను భక్తులు దత్తాత్రేయ అవతారంగా మరియు హనుమంతుని స్వరూపంగా భావిస్తారు. ఇరాన్ అమెరికా /ఇజ్రాయిల్ గల్ఫ్ దేశాలతో పాటు రష్యా ఉక్రైన్ మధ్య యుద్ధాలు సహా.. ప్రపంచంలో అనేక ప్రాంతాలలో యుద్ధాలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా ఆ భారం సామాన్య ప్రజల పైన పడుతోందని, అనేకమంది ప్రాణాలు పోగొట్టుకోవడం లేదా గాయపడుతున్నారన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల బాల్యం ప్రశ్నార్ధకంగా మారుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులలో తక్షణమే యుద్ధాలు నిలిచిపోయి శాంతి పరిస్థితులు ఏర్పడాలని స్వామీజీ వద్ద కోరుకున్నానని తెలిపారు. అదే విధంగా తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రభుత్వం మరింత సానుకూలంగా స్పందించి మన ప్రాంత అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా రామధూత స్వామిని.. సామాన్య ప్రజలతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇతర రంగాల ప్రముఖులు దర్శించుకుని ఆశీస్సులు పొందుతుంటారని బి.వి.రామ్ తెలిపారు. లోక కళ్యాణార్థం పాటుపడుతున్న రామధూత స్వామి లాంటి వారి వల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు.

కలిసిన వారిలో ఫిలిం డైరెక్టర్ వి.వంశీ బాబు, బీసెట్టి నారాయణరావు తదితరులు ఉన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version