Home Politics Andhra Pradesh వినియోగదారుల హక్కులు, రక్షణ చట్టాల పై అవగాహనా సదస్సు

వినియోగదారుల హక్కులు, రక్షణ చట్టాల పై అవగాహనా సదస్సు

0

ప్రధానమంత్రి ఉషా జీఐఈఐ పథకం నిధులతో కోయ్యూరు మండలం మర్రిపాలెంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “వినియోగదారుల హక్కులు మరియు రక్షణ చట్టాలు” అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీడీసీ పాడేరు ప్రిన్సిపాల్ డా. వి. చిట్టబ్బాయి అధ్యక్షత వహించారు. వర్క్‌షాప్ కన్వీనర్‌గా జీడీసీ మర్రిపాలెం ప్రిన్సిపాల్ డా. సుధ వ్యవహరించారు. కార్యక్రమ సమన్వయకర్తగా ఆంగ్ల విభాగ అధ్యాపకురాలు డా. జి. మేరీ పుష్ప, సహ-సమన్వయకర్తగా చరిత్ర విభాగ అధ్యాపకురాలు భువనేశ్వరి దేవి పనిచేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య వనరుల వ్యక్తిగా టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ , ముంబైకు చెందిన టి.టి.ఎస్‌.ఎం. తేజా హాజరై, వినియోగదారుల హక్కులు, వినియోగదారుల రక్షణ చట్టాల ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి వినియోగదారుడికి ఉన్న హక్కులు, నాణ్యతలేని లేదా లోపభూయిష్ట వస్తువులపై ఎలా ఫిర్యాదు చేయాలి, వినియోగదారుల కోర్టులో కేసు ఎలా వేయాలి వంటి అంశాలను నిజజీవిత ఉదాహరణలతో వివరించారు. వినియోగదారులు తమ హక్కులను తెలుసుకుని, చట్ట పరిరక్షణను ఎలా వినియోగించుకోవాలో స్పష్టంగా తెలియజేశారు.
ఈ వర్క్‌షాప్‌ను క్రిస్టల్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, విశాఖపట్నం వారు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొని, వినియోగదారుల హక్కులపై తమకు స్పష్టమైన అవగాహన ఏర్పడిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version