రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ అస్సాం రాష్ట్ర పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎంపీ సి.ఎం రమేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన సందర్భంగా కుటుంబసమేతంగా గౌహతిలోని ప్రసిద్ధి చెందిన కామాఖ్య టెంపుల్ లో శ్రీ కామాఖ్యా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి తో భేటీ అయ్యారు. జన్మదిన సందర్భంగా స్వయంగా శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రికి ఎంపీ సి.ఎం. రమేష్ దుశ్శలువతో సత్కరించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
