Home Politics Andhra Pradesh కృత్రిమ మేధస్సు – భాషా బోధనలో కొత్త విప్లవానికి నాంది

కృత్రిమ మేధస్సు – భాషా బోధనలో కొత్త విప్లవానికి నాంది

0

– ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ నాగరాజు

కృత్రిమ మేధస్సు భాషా బోధనలో ఒక కొత్త విప్లవానికి నాంది” అని ్న హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొ. ఎన్. నాగరాజు అన్నారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం, ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో “ప్రస్తుత ధోరణులు మరియు కృత్రిమ మేధస్సు ఆవిర్భావంతో సాహిత్యం, భాషా బోధనలో భవిష్యత్ అవకాశాలు” అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత విద్యా పరిస్థితులు, ఉపాధ్యాయుల పాత్ర, సాంకేతిక వినియోగం అవసరాన్ని ఉదాహరణలతో వివరించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ (ఇన్‌చార్జ్) ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా ప్రారంభ ప్రసంగం చేస్తూ, ప్రస్తుత విద్యా వ్యవస్థలో కృత్రిమ మేధస్సు (ఏ ఐ) ప్రాధాన్యాన్ని వివరించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాల సమన్వయం ద్వారా బోధన విధానాలు మరింత సమర్థవంతంగా మారుతున్నాయన్నారు.
అధ్యక్ష ప్రసంగం చేసిన విశ్వవిద్యాలయ ఉపకులపతి (ఇన్‌చార్జ్) ప్రొ.తంత్రంవాహి శ్రీనివాసన్, జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలను వివరిస్తూ, బహుళశాఖాధ్యయనం, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక సమన్వయం అవసరాన్ని ఉద్ఘాటించారు. “వికసిత్ భారత్ 2047” లక్ష్య సాధనలో ఉన్నత విద్యాసంస్థల పాత్ర కీలకమని, ముఖ్యంగా భాషా బోధనలో ఎ ఐ వినియోగం ద్వారా ప్రపంచ స్థాయి విద్య అందించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆంగ్ల విభాగాధిపతి (ఇన్‌చార్జ్) డా. బాలుమూరి వెంకటేశ్వర్లు సదస్సు సమన్వయ కర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా షిల్లాంగ్ ఇఫ్లూ క్యాంపస్‌కు చెందిన ప్రొఫెసర్ డా. కె. వెంకట్ రెడ్డి, హైదరాబాద్ ఇఫ్లూ ప్రొ. డా. జి. సువర్ణ లక్ష్మి, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ప్రొ. ఆలపాటి రామనాగ హనుమాన్, హైదరాబాద్ ఇఫ్లూ అసోసియేట్ ప్రొఫెసర్ డా. వి. రాజునాయక్, గీతం విశ్వవిద్యాలయం డా. పెండ్యాల ఆశ, లెండి కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రొ. తమ్మినేని హరి బాబు, వివిధ విభాగాధిపతులు, అతిధి అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు

.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version