- నాటు పడవలో బోల్తా పడి ముగ్గురు మృతి
- మానవత్వం చాటుకున్న అరకు సీఐ ఎల్ హిమగిరి.
అనంతగిరి: జయ జయహే.
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జీనబాడు గ్రామ పరిధిలో రైవాడ రిజర్వ్ డ్యాం లో గత ఆదివారం నాడు. నాటు పడవ తో బోల్తా పడి ముగ్గురు యువకులు గల్లంతయినారు.వెంటనే విషయం తెలుసుకున్న అరకు సీఐ ఎల్ హిమగిరి అనంతగిరి పోలీస్ సిబ్బంది తో ఎస్ డి ఆర్ ఎఫ్ బృందంతో కలిసి రెవిన్యూ సిబ్బంది సాయంతో రిజర్వ్ డాములో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి ఆ రోజు నుండి నేటి వరకు అక్కడే ఉండి ముగ్గురు గిరిజన యువకుల మృతదేహాలు వెలికి తీసి వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగించారు.
సిఐ ముగ్గురు గిరిజన యువకుల మృతుల కుటుంబాల ఇల్లులను పరిశీలించి వారి ఆర్థిక పరిస్థితులు గమనించి మానవత్వంతో మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం కింద ఒక్కొక్క కుటుంబానికి ₹5000/ రూపాయల చొప్పున మొత్తం ₹15000/ రూపాయలు సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. అంతట పోలీస్ వారి సేవలను చూసి అనంతగిరి మండల స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు సీఐ ఎల్ హిమగిరి కు పోలీస్ బృందానికి ప్రత్యేకంగా అభినందించారు.
