Home Politics Andhra Pradesh ఏపీ అభివృద్ధి బీ జే పి తోనే సాధ్యం

ఏపీ అభివృద్ధి బీ జే పి తోనే సాధ్యం

0

భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమార్ స్వామి భారతీయ జనతా కిసాన్ మోర్చా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పొట్నూరు కృష్ణారావు ఆధ్వర్యంలో జిల్లా కిసాన్ మోర్చా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం విశాఖపట్నం జిల్లాలో ఆనందపురం మండలంలో వేములవలసలో సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమార్ స్వామి, బిజెపి జిల్లా అధ్యక్షులు ఎం ఎన్ ఎం. పరశురామ రాజు, బిజెపి రాష్ట్ర కోశాధికారి ఎం. నాగేంద్ర, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వి.సుబ్బారావు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి మాట్లాడుతూ,
వీబీ–జీ రామ్ జీ పనికి ఆహార పథకం గురించి మాటాడుతూ ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు రైతులు, కూలీలు, పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించబడుతుందన్నారు. గతంలో అమలులో ఉన్న ఎంజిఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంలో సంవత్సరానికి 100 పని దినాలు మాత్రమే ఉండగా, ప్రస్తుత వి బి జీ రామ్ జీ పథకం ద్వారా ఆ పని దినాలను 125 రోజులకు పెంచా మన్నారు. పథకాల మధ్య ఉన్న తేడాను కూడా ఆయన వివరించారు. ఎం జి ఎన్ ఆర్ ఈ జీ ఎస్ పథకం ప్రధానంగా ఉపాధి కల్పనకే పరిమితమై ఉండగా పథకం ద్వారా పని ఆహార భద్రత గ్రామీణ అభివృద్ధి అన్న మూడు లక్ష్యాలను ఒకేసారి సాధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కుమార్ స్వామి అన్నారు. ఈ పథకం ద్వారా రైతు కుటుంబాల జీవన ప్రమాణం మెరుగుపడటంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. అలాగే, విశాఖపట్నం జిల్లాలో భారతీయ జనతా కిసాన్ మోర్చాను మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి గ్రామంలో రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి రైతు వరకు తీసుకెళ్లే బాధ్యత కిసాన్ మోర్చా కార్యకర్తలదేనని తెలిపారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, పార్టీని గ్రామస్థాయిలో విస్తరించేందుకు ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని కార్యకర్తలకు సూచించారు. గ్రామ కమిటీల ద్వారానే రైతుల సమస్యలను సమర్థవంతంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లవచ్చని కుమారస్వామి అన్నారు. ఇదే సందర్భంగా, ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, విశాఖ జిల్లాలోని అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేయాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో, పండుగ వాతావరణంలో నిర్వహిస్తూ పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ రైతు సంక్షేమ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఈ సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అన్నెపు ఉమామహేశ్వరరావు, ప్రకాష్ రెడ్డి,
కైలాస రెడ్డి, చక్రవర్తి, పి.శ్రీనివాస నాయుడు, రవి రాజు, వాసు, ధానేష్, పోతన పైడిరాజు, డిపి రాజు, జిల్లా, మండల, గ్రామస్థాయి కిసాన్ మోర్చా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సమావేశాన్ని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పొట్లూరు వెంకట కృష్ణారావు పర్యవేక్షించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version