Home Politics Andhra Pradesh కృషి పట్టుదలతో ఏదైనా సాధ్యమే

కృషి పట్టుదలతో ఏదైనా సాధ్యమే

0

హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 9వ వార్షికోత్సవ వేడుకలు శింగనమల మండలంలోని లోలూరు గ్రామ సమీపంలో, హర్ష టయోటా ఎదుట ఉన్న హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం విద్యార్థులు, తల్లిదండ్రులు, అతిథులు, ఉపాధ్యాయులతో కళకళలాడింది. పండుగ వాతావరణంలో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ శ్రీనివాసరావు హాజరయ్యారు. సింగనమల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కౌలుట్లయ్య, టూ టౌన్ సీఐ శ్రీకాంత్, ఎస్సై విజయ్ కుమార్, పాఠశాల సీఈఓ ప్రతాప్ రెడ్డి, జీఎం రామసుబ్బారెడ్డి, ఏజీఎం శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

*శ్రద్ధతో చదివితేనే విజయం : డీఎస్పీ శ్రీనివాసరావు*

విద్యార్థులు శ్రద్ధతో చదివితేనే ప్రయోజకులవుతారని తెలిపారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, వారి ఆశలను నెరవేర్చేలా మంచి అలవాట్లు అలవరచుకోవాలని సూచించారు. ప్రతి రోజు పాఠశాలకు హాజరవుతూ, స్నేహపూర్వక వాతావరణంలో చదువుకోవాలని పేర్కొన్నారు.

*చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి : సీఐ కౌలుట్లయ్య*

చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపితే మంచి అవకాశాలు లభిస్తాయని అన్నారు. విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగి తల్లిదండ్రులు, గురువులు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

*విలువలతో కూడిన విద్యే నిజమైన విద్య – సీఈఓ ప్రతాప్ రెడ్డి*

తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. పాఠశాలలో డిజిటల్ తరగతి గదులు, నైపుణ్యమైన అధ్యాపక బృందం, సౌకర్యవంతమైన వాతావరణంలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా క్రమశిక్షణతో చదివి తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని సూచించారు.

*పది ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించాలి*

పదవ తరగతి పరీక్షల్లో పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. పోటీ భావనతో చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించి సమాజానికి సేవ చేయాలని విద్యార్థులను ప్రోత్సహించారు.

*విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి : ఏజీఎం శంకర్ నారాయణ*

క్రమశిక్షణకు నిదర్శనమే హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని పేర్కొన్నారు. చదువుతో పాటు నైతిక విలువలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు అలవరచుకోవాలని సూచించారు. విద్యను సవాల్‌గా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి
యాన్యువల్ డే సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు, హిందీ పాటలకు నృత్యాలు, ఆటపాటలతో ప్రేక్షకులను అలరించారు. విద్యార్థులు తమలోని సృజనాత్మకతను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version