Home News గూగుల్ తరువాత విశాఖలో మరో అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్

గూగుల్ తరువాత విశాఖలో మరో అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్

0
  • విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్
  • మరో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు
  • రిలయెన్స్, బ్రూక్ ఫీల్డ్, డిజిటల్ రియాల్టీ మధ్య ఒప్పందం
  • 1 గిగా వాట్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒకే
  • గూగుల్ తరువాత విశాఖలో మరో అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్

(అమరావతి – జయజయహే)

విశాఖకు మరో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి వస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రూక్‌ఫీల్డ్, డిజిటల్ రియాల్టీల మధ్య జాయింట్ వెంచర్ గా ఏర్పడిన డిజిటల్ కనెక్షన్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టనుంది. 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన ఎఐ -నేటివ్ డేటా సెంటర్ల నిర్మాణానికి సుమారు 11 బిలియన్ల డాలర్లు అంటే రూ.98,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నామని ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ 400 ఎకరాల విస్తీర్ణంలో 2030 నాటికి అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ తో ఎంవోయూ చేసుకున్నారు. గూగుల్ గత నెలలో 15 బిలియన్ డాలర్లతో విశాఖలో ఎఐ హబ్ నిర్మాణం ప్రకటించిన తర్వాత ఇది రెండో పెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌గా నిలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా హైపర్‌స్కేలర్లు, ఎంటర్‌ప్రైజ్‌లకు ఏఐ వర్క్‌లోడ్‌లకు మద్దతు ఇచ్చే ఫ్యూచర్-రెడీ సిస్టమ్‌లు అందుబాటులోకి వస్తాయి.

డిజిటల్ కనెక్షన్ ప్రకటన ప్రకారం, ఈ డేటా సెంటర్లు ప్రత్యేకంగా ఎ ఐ -నేటివ్‌గా, పర్పస్-బిల్ట్‌గా రూపొందిస్తారు. ఇందులో రోబస్ట్ సబ్‌స్టేషన్లు, రెడండెంట్ పవర్ ఫీడ్‌లు, అధిక ర్యాక్ డెన్సిటీలు ఉంటాయి. డిజిటల్ కనెక్షన్ డేటా సెంటర్లు సీమ్‌లెస్ AI వర్క్‌లోడ్‌లకు ప్రత్యేకంగా రూపొందిస్తారు. హైపర్‌స్కేలర్లు, ఎంటర్‌ప్రైజ్‌లకు ఫ్యూచర్-రెడీ సిస్టమ్‌లు, రోబస్ట్ సబ్‌స్టేషన్లు, రెడండెంట్ పవర్ ఫీడ్‌లు, ర్యాక్ డెన్సిటీలతో కలిపి తదుపరి దశ ఎ ఐ ఇన్నోవేషన్‌కు శక్తినిస్తాయి.

ఈ ఇన్వెస్ట్‌మెంట్ 2030 వరకు ఐదేళ్ల కాలంలో అమలు చేస్తారు. విశాఖపట్నం డేటా సెంటర్ హబ్‌గా అభివృద్ధి చెందుతుందని, ఇది భారతదేశ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు మరో మైలురాయిగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గూగుల్ తర్వాత ఈ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్‌ను ఎ ఐ, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో దక్షిణ భారతదేశ హబ్‌గా మార్చడానికి దోహదపడుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గతంలో డిజిటల్ ఇన్‌ఫ్రా మీద దృష్టి పెట్టినట్లుగా ప్రకటించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ ఇన్వెస్ట్‌మెంట్‌లను ఆకర్షించడానికి ప్రత్యేక పాలసీలు, ఇన్సెంటివ్‌లు అందిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది ఉద్యోగాలు వస్తాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది. నారా లోకేష్ కూడా ఈ ప్రకటన పట్ల సంతృప్తి వ్య్కతం చేశారు.

ఎ ఐ , క్లౌడ్ సర్వీస్‌ల పెరుగుదలతో డేటా సెంటర్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ఇన్వెస్ట్‌మెంట్ దక్షిణాది రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తుంది. పెట్టుబడులన్నీ గ్రౌండ్ అవడం ప్రారంభిస్తే.. విశాఖ ముఖ చిత్రమే మారిపోయే అవకాశాలు ఉన్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version