Tuesday, April 21, 2026
HomePoliticsAndhra Pradeshపోతన పూడి, డి గొట్టివాడ లలో పశు ఆరోగ్య శిబిరాలు

పోతన పూడి, డి గొట్టివాడ లలో పశు ఆరోగ్య శిబిరాలు

మాడుగుల మండలంnపోతనపూడి, డి గొట్టివాడ గ్రామాలలో బుధవారం పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు.పశు సంవర్ధక శాఖ ఆద్వర్యంలో పోతన పూడి గ్రామంలో పశు ఆరోగ్య శిబిరo కార్యక్రమాన్ని కూటమి నాయకులు ప్రారంబించి పాడి పశువులకు, పెయ్యలకు స్వయంగా నట్టల నివారణ మందులు పట్టారు.డి గొట్టివాడలో ఈ కార్యక్రమాన్ని గ్రామ కోటమి నాయకులు ప్రారంభించారు.రెండు గ్రామాల్లో 250 పశువులకు సాదారణ చికిత్సలు,125 పశువులకు గర్భ కోశ వ్యాధుల చికిత్స లు, 40 పశువులకు చూడి పరీక్షలు,165 పశువులకు,123 పెయ్యలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మొత్తం 140 మంది రైతులు ఈ సేవలు వినియోగించుకున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పశు వైద్యులు డా. మణి లక్ష్మణ్, డా. శివ కుమార్, ఎల్.ఎస్.ఎ. వర్మ, విఏ నాని బాబు, పశు వైద్య సహాయకులు చంద్ర, బాబ్జి, మణికంఠ, వరలక్ష్మి, శ్రీను, కన్నం నాయుడు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments