Home News జమ్మాదేవిపేట, వొమ్మలి గ్రామాలలో పశు ఆరోగ్య శిబిరాలు

జమ్మాదేవిపేట, వొమ్మలి గ్రామాలలో పశు ఆరోగ్య శిబిరాలు

0

మాడుగుల మండలం జమ్మాదేవిపేట, వొమ్మలి గ్రామాలలో సోమవారం పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు.పశు సంవర్ధక శాఖ ఆద్వర్యంలో జమ్మాదేవిపేట గ్రామంలో పశు ఆరోగ్య శిబిరo కార్యక్రమాన్ని ఎం.పి.పి. తాళ్ళపురెడ్డి రాజారాం, గ్రామ సర్పంచ్ కోసిరెడ్డి కృష్ణమూర్తి, కూటమి నాయకులు వడ్డి రాజ్ కుమార్ ప్రారంబించి పాడి పశువులకు, పెయ్యలకు స్వయంగా నట్టల నివారణ మందులు పట్టారు. ఈ కార్యక్రమానికి మాడుగుల ఏరియా పశు వైద్యశాల సహాయ సంచాలకులు డా. చిట్టి నాయుడు హాజరై పర్యవేక్షించారు.వొమ్మలి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సుంకరి సింహాచలం నాయుడు, టిడిపి మండల అధ్యక్షులు నందారపు సన్యాసిరావు, జనసేన నాయకులు సేనాపతి అశోక్ చేతులమీదుగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా 104 పశువులకు సాదారణ చికిత్సలు , 35 పశువులకు గర్భ కోశ వ్యాధుల చికిత్స లు, 28 పశువులకు చూడి పరీక్షలు, 42 పశువులకు, 84 పెయ్యలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మొత్తం 76 మంది పాడి రైతులు ఈ సేవలు వినియోగించుకున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పశు వైద్యులు డా. మణి లక్ష్మణ్, డా. శివ కుమార్, వి. ఎల్. ఓ ప్రసాద్, ఎల్.ఎస్.ఎ. వర్మ, విఏ నాని బాబు, పశు వైద్య సహాయకులు చంద్ర, బాబ్జి, మణికంఠ, రమేష్ , శ్రీను , మణి కంఠ పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version