Friday, April 17, 2026
HomeNewsభోగాపురంలో పశు ఆరోగ్య శిబిరం

భోగాపురంలో పశు ఆరోగ్య శిబిరం

చోడవరం మండలం భోగాపురం గ్రామంలో సోమవారం పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ పశు ఆరోగ్య శిబిరాలు ఈనెల 19వ తేది నుంచి 31వ తేదీ వరకు పలు గ్రామాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పశువులకు, గొర్రెలు, మేకలకు దూడలకు ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు.గొర్రెలు మేకలకు మసూచి వ్యాధి టీకాలు వేయడం జరిగింది. పాడిపశువులకు గర్భ కోశ వ్యాధులకు సంబంధించిన చికిత్స చేసి వాటికి తగిన మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొలిమేర బాల గంగాధర శ్రీనివాసరావు, ఎంపీటీ ఆడారి కోటి భూలోకానాయిడు ఇతర నాయకులు పాల్గొన్నారు. పశు సంవర్ధకశాఖ నుంచి ఏరియా పశువైద్యశాల చోడవరం అసిస్టెంట్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు,గోవాడ పశువైద్యాధికారి డాక్టర్ కే.వాత్స్యవి సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments