Home Politics Andhra Pradesh అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

0

టెక్కలి ప్రాజెక్ట్ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష లు

అంగన్వాడి లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికిచ్చే కనీస వేతనం , 26వేల రూపాయలు చెల్లించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టెక్కలి ఐసిడిఎస్ కార్యాలయం ముందు అంగన్వాడి ల యూనియన్ సి ఐ టి యు పిలుపుమేరకు నిరాహార దీక్ష సోమవారం నిర్వహించారు.

ప్రభుత్వo తక్షణమే లేబర్ కోడ్లు రద్దు చేయాలని కార్యకర్తలంతా నినాదాలు చేశారు, ఈ సందర్భంగా సిఐటియు నాయకులు నంబూరు షణ్ముఖరావు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మిక కష్టజీవులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని, దోపిడీ వర్గాల కు అనుకూలంగా ఉండి కార్మికుల హక్కులను కాలరాయడం తగదని షణ్ముఖరావు తెలిపారు.
ప్రజా పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకోవాలని, నిర్బంధాలను అధిగమించి ఐక్యమత్యంతో ఉద్యమంచాలని రైతు సంఘం ప్రతినిధి కొల్లి ఎల్లయ్య డిమాండ్ చేశారు. తమ హక్కులు సాధించేవరకు నిరంతరంగా దీక్ష కార్యక్రమాలు జరుగుతాయని అంగన్వాడి సంఘం అధ్యక్షురాలు ఆదిలక్ష్మి రవణమ్మలు తెలిపారు.
ఈ దీక్ష కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు నిర్మల, అరుణ, దమయంతి, పద్మ, కృష్ణవేణి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version