Home Politics Andhra Pradesh మార్చి 25న ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం

మార్చి 25న ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం

0

ఏ యూ రిజిస్ట్రార్ కె.రాంబాబు

ఆంధ్ర విశ్వవిద్యాలయం 91,92 సంయుక్త స్నాతకోత్సవం మార్చి 25న నిర్వహించనున్నట్లు ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆరోజు ఉదయం 11 గంటలకు బీచ్ రోడ్ లోని ఏయు కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ స్నాతకోత్సవం జరుగుతుంది. గతంలో దరఖాస్తు చేసిన వారందరూ ఈ స్నాతకోత్సవంలో పట్టాలను అందుకోనున్నారు. స్నాతకోత్సవ పట్టాలను స్వీకరించేవారు ఉదయం 10 గంటలకు ప్రాంగణానికి చేరుకుని తమకు కేటాయించిన స్థానంలో ఆసీనులు కావాలని సూచించారు. కార్యక్రమం పూర్తయిన తరువాత విశ్వవిద్యాలయ చాన్స్లర్, ముఖ్య అతిథి తదితరులు వెళ్లే వరకు వీరంతా తమ కేటాయించిన స్థానాల్లో ఉండాలని సూచించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version