Home Politics Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ ఆత్మీయ సభ రాజమండ్రి

ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ ఆత్మీయ సభ రాజమండ్రి

0

చర్చ్ పేటలో సెయింట్ పాల్ లూథరన్ చర్చిలో ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ ఆత్మీయ సభ మరియు థాంక్స్ గివింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. ఏపీ బిషప్ కౌన్సిల్ అధ్యక్షుడు యజ్జల బాలరాజు మాట్లాడుతూ క్రైస్తవులందరూ ఐకమత్యంతో పని చేయవలసిన సమయం ఆసన్నమైందని తెలియజేశారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను మనందరం ఐక్యతగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉండదని తెలియజేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ మాట్లాడుతూ క్రైస్తవ్యం అంటేనే లోకానికి శాంతి సందేశాన్ని అందించడమని, క్రైస్తవ్యం అంటేనే కృతజ్ఞతకు చిహ్నం అని తెలియజేశారు. క్రైస్తవులందరూ తమను తాను తగ్గించుకొని క్రైస్తవ సమాజం కోసం పనిచేయవలసిన అవసరం ఆసన్నమైందని తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో క్రైస్తవులకు జరిగిన ఉపకారాన్ని తెలియజేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులకు కొత్తగా చేసింది ఏమీ లేదని తెలియజేశారు. ఈ కూటమి ప్రభుత్వం మాటలను నమ్మి ఓటేసిన రాష్ట్ర ప్రజలందరూ బాధపడే పరిస్థితి వచ్చిందని తెలియజేశారు. ముఖ్యంగా క్రైస్తవులపై దాడులు ఎక్కువయ్యాయని తెలియజేశారు. ఏ ప్రభుత్వంలోనైనా క్రైస్తవులకు అన్యాయం జరిగితే మనందరం సంఘటితంగా పోరాడవలసిన అవసరం బిషప్పులైన మీ అందరి మీద ఉన్నదని తెలియజేశారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని యేసు క్రీస్తు చెప్పిన మాటలను మనం నిజం చేసే విధంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు ఉండాలని కోరారు, అప్పుడే సమాజం బాగుపడుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమ నిర్వాహకుడు గంధం జాకబ్ మాట్లాడుతూ దేవుడు తమ కుటుంబం పట్ల చేసిన మేళ్లను గుర్తు చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో ఏపీ బిషప్ కౌన్సిల్ కార్యవర్గం మరియు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నుంచి అధిక సంఖ్యలో బిషప్లు మరియు క్రైస్తవ నాయకులు పాల్గొన్నారు .

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version