Home Politics Andhra Pradesh వైసీపీ ని కాపు కాస్తున్న అంబటి

వైసీపీ ని కాపు కాస్తున్న అంబటి

0

టీడీపీ నేతల ఆరోపణ

వైసీపీ ని కాపుల పేరిట కాపు కాస్తున్న నాయకుడు అంబటి రాంబాబు కూటమి పై అవాకులు… చెవాకులు పేలితే ఊరుకునేది లేదని పలువురు టీడీపీ నేతలు అన్నారు. పార్టీ కార్యాలయంలో శనివారం వారు విలేకరులతో మాటాడుతూ ఇటీవల గాజువాక వేదికగా మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను టిడిపి కాపు నాయకులు ఖండించారు. కూటమి ప్రభుత్వం కాపు లకు అన్యాయం చేస్తుందని అంబటి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ని కాపు కాసే నాయకుడు అంబటి రాంబాబు మాటలు అసభ్యకరంగా ఉండడం వలన జైలు కి వెళ్లారన్నారు. కూటమి ప్రభుత్వం కాపు ల పక్షపాతి అని, సీఎం చంద్రబాబు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపులను ఆర్ధికంగా ఆదుకున్నారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కాపు లను అణగతొక్కిందని, అందుకే అంబటి రాంబాబును వంగవీటి రంగా తో పోల్చడం దారుణమన్నారు. కాపు లు అంబటి రాంబాబు కు మద్దతు ఇవ్వడం లేదని అంబటి భయపడుతున్నాడు కాబట్టే కాపు కార్డును ఉపయోగించుకుంటున్నారన్నారు. జగన్ కాపులను ఓటు బ్యాంకు గానే వాడుకుంటున్నారని,
ఆయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మెలగాలని, కులాలు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న రాంబాబు కు కాపులు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ
విలేకరుల సమావేశంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి బోండా జగన్, తోటరత్నం, 98వార్డు కార్పొరేటర్ పి వి నరసింహ,
విశాఖ పార్టీ ప్రధాన కార్యదర్శి లోడల కృష్ణ, మీడియా కోఆర్డినేటర్ సాయి రెడ్డి, పోతన రెడ్డి, 26 వార్డు అధ్యక్షులు ముక్క కిషోర్, తదితరులు పాల్గొన్నారు,

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version