అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగం వివాదస్పద వ్యాఖ్యలు
తమిళనాట రగులుతున్న మహిళలు
లేడీ సూపర్ స్టార్, ప్రముఖ నటి నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగం. ఎంకే స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన అనవసరంగా నయన్ పేరును ప్రస్తావనకు తీసుకొచ్చారు. దీంతో ఎంపీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళా లోకానికి ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడం, మాదకద్రవ్యాల వ్యసనాన్ని నియంత్రించడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందంటూ అన్నాడీఎంకే కూటమిమంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టిది. చెన్నైలో జరిగిన ఈ నిరసనకు ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వం వహించారు . గత కొన్ని నెలలుగా తమిళనాడులో మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయని, విద్యార్థులలో మాదకద్రవ్యాల వ్యసనం పెరుగుతోందని ఈ సందర్భంగా అన్నాడీఎంకే నేతలు ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో, విల్లుపురం జిల్లాలోని కొత్త బస్ స్టాండ్ సమీపంలో ఎంపీ షణ్ముగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశం మధ్యలోనే ఆయన మట్లాడుతూ నయనతారపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘ఇటీవల, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ‘మీ కలను చెప్పండి’ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిని విమర్శిస్తూ, ఆయన ఇలా అన్నారు, “అబ్దుల్ కలాం ‘కలలు కనండి’ అన్నారు. మన ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకు వేసి ‘మీ కల చెప్పండి’ పథకాన్ని ప్రారంభించారు. నాకు నయనతార కావాలని అడిగితే.. ఆయన నెరవేరుస్తారా..? ఆమెను పెళ్లి చేసుకోవాలనే కల ఎవరికైనా ఉంటే . తమిళనాడు ముఖ్యమంత్రి తీరుస్తారా’ అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. దీంతో ఈ మాజీ ఎంపీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళా లోకానికి ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
