Home News ముంచంగిపుట్టులో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ముంచంగిపుట్టులో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

0
  • ముంచంగిపుట్టులో రాజ్యాంగ స్ఫూర్తి!
  • ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
  • అంబేడ్కర్ విగ్రహానికి ఘన నివాళులు

ముంచంగిపుట్టు, జయ జయహే : అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండల మండల కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గెస్ట్ హౌస్ నుంచి అంబేడ్కర్ పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయ సాధన సమితి ప్రతినిధి రొబ్బ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం యొక్క ప్రాధాన్యత, రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులు, మరియు సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి మౌలిక విలువలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.

భారత పౌరులందరికీ రాజ్యాంగం యొక్క గొప్పతనం, దాని అమలు ప్రాముఖ్యతను ఆయన వివరించారు. రాజ్యాంగ విలువలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. రాజ్యాంగ విలువలను రక్షించుకుంటూ, సమ సమాజ స్థాపనకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు, నేతలు, ప్రజలు, విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ముంచింగిపుట్టు లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం. ఈ కార్యక్రమంలో జిటిడబ్ల్యూ బాలురు-1, 2 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బి. శంకర్ రావు, ఉపాధ్యాయులు కె. ఆదినారాయణ, సిహెచ్ ధనుర్జయ్, పి.గిరీష్ బాబు, ఎస్.నారాయణ, టి.చిన్న కొండబాబు, కె.రాజారావు, కె.కళ్యాణ్, కె.గంగభవాని, పి.అప్పలనాయుడు, టి.లవకుశ, గణేష్, బి. శంకర్,కె. కృష్ణారావు, దీక్షపాతి,నాగభూషణ్,బాలకృష్ణ లతో పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version