` పట్టించుకోని పోలీస్ బాస్…!
` తూతూ మంత్రంగా కేసులు నమోదు
` మహిళను లోబర్చుకున్న ఘటనలో బుచ్చిరెడ్డిపై కేసు
` సహకరించిన ఆయన భార్య జ్యోతి రెడ్డి పైనా
` డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి రూ.65లక్షలకు సంతకాలు
` బాధితురాలి ఫిర్యాదు మేరకు ఫోర్త్‌టౌన్ పోలీసులు కేసు
` బుచ్చిరెడ్డి దారుణాలపై పది కేసులు
` వరుస కేసులు నమోదవుతున్నా దర్యాప్తు నిల్
మహా నగరంలో మాయగాడు ప్రముఖ చీటర్ చింతపల్లి బుచ్చిరెడ్డి అండ్ కోపై కేసుల మీద కేసులు నమోదవుతున్నా దర్యాప్తు విషయంలో మాత్రం నగర పోలీసులు అంటీ అంటనట్టు వ్యవహరిస్తున్నారు. భారీగా ఆస్తులు, నగదు, బంగారం, వస్తు సామగ్రి కాజేస్తూ జనాన్ని నిండా ముంచేసిన బుచ్చిరెడ్డి వ్యవహారంలో పోలీసులు అంత వేగంగా దర్యాప్తు చేయడం లేదు. పట్టువీడని విక్రమార్కునిలా వెంటాడుతున్న బాధితుల కంటితుడుపు కోసమే తప్పా తీవ్ర చర్యలు తీసుకునే దిశగా పోలీసుల అడుగులు వేయడం లేదు. తప్పంతా పెట్టుకుని తప్పించుకుందామన్నట్టుగా పోలీసులు ఆ కేసు వ్యవహారంలో అతి జాగ్రత్త పడుతున్నారు. దీని వెనుక భారీ ఎత్తున చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే రెండు రోజుల పాటు బుచ్చిరెడ్డిని ద్వారకా పోలీస్ స్టేషన్‌లో ఉంచుకుని మరీ గుట్టు చప్పుడు కాకుండా వదిలేసి తప్పించుకుపోయాడని బాధితులకు చెప్పడంలో ఆంతర్యం ఏంటో ఆ పోలీసులకే తెలియాలి. నగర వ్యాప్తంగా ఇప్పటికే ఏడు పోలీస్ స్టేషన్లలో బుచ్చిరెడ్డిపై 8వరకు కేసులు పెండింగ్‌లో ఉండగా తాజాగా ద్వారకా పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈనెల 3న ఫోర్త్‌టౌన్ పోలీసులు ..బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న జ్యోతి (ఆయన భార్య) ఫైనాన్స్ అండ్ కీర్తన రెడ్డి గోల్డ్ ఫైనాన్స్ సంస్థపై కేసు నమోదు చేశారు. బంగారం తాకట్టు పెట్టేందుకు వచ్చిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి బాధితురాల నుంచి దొంగ సంతకాలు తీసుకున్న సంఘటనలో బాధితురాలి ఫిర్యాదు మేరకు ద్వారకా పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. అంతేకాకుండా బాధితురాలు నగ్నంగా ఉన్నట్టు ఫొటోలు, వీడియోలు తీసి, బంగారంపై ప్రశ్నిస్తే ఆ ఆధారాల్ని సోషల్ మీడియాలో పెడతామంటూ బుచ్చిరెడ్డి ఆయన భార్య జ్యోతి రెడ్డి బెదిరించినట్టు వెలుగులోకి వచ్చింది. ఇంత జరుగుతున్నా పోలీస్ కమిషనరేట్ నుంచి ఒక్క ప్రకటన కూడా విడుదల కాలేదు. ఇలాంటి కేసుల్లో పోలీసులు సాధారణంగా ఇంకెవరైనా బాధితులుంటే ముందుకు రావాలంటూ పిలుపునిస్తుంటారు. కానీ ఎవరికి వారే చీటింగ్ కేసులు నమోదు చేసేసి చేతులు దులిపేస్తున్నారు తప్పితే ఒక కార్యాచరణ మాత్రం కనిపించడం లేదు. తమను మోసం చేసిన బుచ్చిరెడ్డిపై చర్యలు చేపట్టాలంటూ బాధితులు ఏకంగా ఆయన ఇంటి ముందు టెంట్ వేసినా పోలీసులు అటు వైపే చూడడం లేదు. బుచ్చిరెడ్డి స్వాధీనంలో బోలెడన్ని కార్లు ఉన్నా వాటి పరిస్థితిని పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యులెవరన్న ప్రశ్నకు పోలీసుల నుంచి సరైన సమాధానం లేదు. చీటికిమాటికీ చిన్న చిన్న సంఘటనలకూ ప్రెస్‌మీట్లు పెట్టేసి హడావుడి చేసేస్తున్న పోలీసులు బుచ్చిరెడ్డి వ్యవహారంలో ఈ నాన్చుడేంటోనని బాధితులు ఆవదేన వ్యక్తం చేస్తున్నారు.
..
ఇదిగో తాజా కేసు
..
పీఎంపాలెంనకు చెందిన ఒక మహిళ (36) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 3న 56/2026పేరిట బీఎనఎస్ 318 (4), 351 (2), రెడ్ విత్ 3 (5) సెక్షన్లను నమోదు చేశారు. ఈ కేసులో బుచ్చిరెడ్డితో పాటు ఆయన భార్య జ్యోతి రెడ్డిపైనా ఫిర్యాదులందాయి. పీఎంపాలేనికి చెందిన బాధితురాలు కొత్త ఇల్లు కొనుగోలు చేసేందుకు తన వద్ద ఉన్న 680గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు ప్రయత్నించారు. బాలయ్యశాస్త్రి లే అవుట్‌లో బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న జ్యోతి ఫైనాన్స్ అండ్ కీర్తన రెడ్డి గోల్డ్ ఫైనాన్స్ సంస్థను ఆశ్రయించారు. అన్నీ పరిశీలించాక రూ.65లక్షల్ని ఆమె బ్యాంకు ఖాతాకు జమ చేయిస్తామని బుచ్చిరెడ్డి ఆయన భార్య జ్యోతి నమ్మబలికారు. సొమ్ము ఇవ్వలేదు సరికదా బాధితురాలి నగల్ని జ్యోతి ధరించినట్టు ఆమె గ్రహించారు. దీంతో బతిమలాటకు దిగిన భార్యభర్తలు ఆ తర్వాత రోజు రమ్మని చెప్పి శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చినట్టు బాధితురాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా భార్య జ్యోతి సహాయంతో బుచ్చిరెడ్డి బాధిత మహిళపై అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా నగ్నంగా ఉన్న బాధితురాలి ఫొటోలు, వీడియోలు కూడా తీసినట్టు ప్రాథమికంగా తేలింది. ప్రశ్నిస్తే ఆ ఆధారాల్ని సోషల్ మీడియాలో పెడతానని బుచ్చిరెడ్డి బెదిరించినట్టు తెలిసింది. బుచ్చిరెడ్డి దారుణాల్ని భరించలేక బాధితురాలు ఒక దశలో ఆత్మహత్యాయత్నానికి కూడా పా?పడ్డారు. ఇదిలా ఉంటే డబ్బులిచ్చేసినట్టు బాధితురాలి నుంచి బుచ్చిరెడ్డి దంపతులు సంతకాలు కూడా తీసుకున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే చంపేస్తామంటూ బుచ్చిరెడ్డి దంపతులు బెదిరించడంతో బాధితురాలు ఫోర్త్‌టౌన్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ మేరకు సీఐ ఉమాకాంత్ నేతత్వంలో ఎస్ ఐ బొడ్డేపల్లి బాలకష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
