సర్పంచ్ పూర్ణిమ కు ప్రశంసలు
హుకుంపేట మండలం హుకుంపేట పంచాయతీ లో సర్పంచ్ సమిడ. వెంకట పూర్ణిమ సర్పంచ్ పదవికాలం ముగియడంతో సెక్రటరీ సత్య నారాయణ ఆధ్వర్యంలో సర్పంచ్ పూర్ణిమ మరియు పాలక వర్గ సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది… ఈ సందర్బంగా సర్పంచ్ పూర్ణిమ మాట్లాడుతూ ఏప్రిల్ 2 వ తేది తో సర్పంచ్, పాలకవర్గ సభ్యులు పదవి కాలం ముగుస్తున్న తరుణం లో పంచాయతీ కి ఈ 5 సంవత్సరంలు సహకరించి, సర్పంచ్ తో పాటు పంచాయతీ అభివృద్ధి కి కృషి చేసిన పాలకవర్గన్ని సన్మానించడం జరిగింది అని, ఈ 5 సంవత్సరం లు సహాయ సహకారాలు అందించిన స్థానిక పంచాయతీ ప్రజలు కు ప్రజా ప్రతినిధులు కు, ఉద్యోగులకు అందరకి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.. అనంతరం రానున్న రోజులు లో పదవులు తో సంబంధం లేకుండా పంచాయతీ అభివృద్దే లక్ష్యంగా కృషి చేస్తా అని ఆమె తెలిపారు ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ సర్పంచ్ పూర్ణిమ చిన్న వయసులోనే భాద్యతలు చేపట్టి పంచాయతీ లో మంచి పేరు తెచ్చుకున్నారని రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు చేపట్టాలని తండ్రి కి తగ్గ తనయురాలుగా ఎదగాలని సర్పంచ్ పూర్ణిమ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ సమిడ వెంకట పూర్ణిమ, ఇఓ పిఆర్డి రామ్ నాయుడు, సెక్రటరీ సత్యనారాయణ,పంచాయతీ వార్డ్ మెంబెర్స్ నాగబాబు, వెంకట్, లక్ష్మణ్, అన్నపూర్ణ, గంగ,నూకరాజు, భాస్కర్,మచ్చమ్మ వైస్ సర్పంచ్ కోడిదాస్ గోవింద్ రావ్,ఎంపీటీసీ కొమ్మ రమ,పెసా కమిటీ సభ్యులు రామకృష్ణ, గణేష్, వీర్రాజు,హుకుంపేట మండలం అధ్యక్షులు అనిల్ సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, ఆశలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్ పూర్ణిమ కు ఘన సన్మానం.
RELATED ARTICLES
