బ్లడ్ బ్యాంకు తో వేలాదిమంది ప్రాణాలు కాపాడిన గురునాధ్
నారా భువనేశ్వరి చేతులమీదుగా జ్ఞాపిక
హైదరాబాద్ లో శనివారం జరిగిన ఎన్ టి ఆర్ ట్రస్ట్ 29 వ ఫౌండేషన్ డే లో విశాఖపట్నం పెద జాలరిపేట కు చెందిన ఒలిశెట్టి గురునాధ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఘనంగా సన్మానించారు కొన్ని సంవత్సరాలుగా 72 బ్లడ్ క్యాంపులు, 12 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి 95 సార్లు రక్తదానం చేసిన గురునాధ్ సేవల్ని ఎన్ టి ఆర్ ట్రస్ట్ అభినందించింది బ్లడ్ బ్యాంకు ను సొంతంగా ఏర్పాటు చేసి వేలాదిమందికి రక్తం అవసరాలకు అందించి ప్రాణాలు కాపాడిన గురునాద్ గొప్ప సంస్కారణీయుడని వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమం లో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, ప్రజాప్రతినిధులు గురునాద్ ను అభినందించారు

