ఓ పి ఎస్ ను తక్షణమే అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమాలోచనలు చేసి ఉపాధ్యాయుల భవిష్యత్తుకు భరోసా కల్పించి ఓ పి ఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తమ దశల వారి పోరాటంలో భాగంగా సహా చర ఉపాధ్యాయులను భాగస్వామ్యులను చేస్తూ శ్రీకూర్మం జడ్పీ హైస్కూల్ లో నల్ల రిబ్బన్లతో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వం తక్షణమే పి ఆర్ సి కమిషన్ను నియమించాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి కోలక కృష్ణమోహన్ డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులకు అందాల్సిన ఆర్థిక బకాయిలన్నింటినీ ప్రభుత్వం చెల్లించాలని ఉద్యోగుల మధ్యంతర భృతి చెల్లించాలని వారి జీవితాలకు భరోసా లేని సిపిఎస్ ను రద్దు చేసి ఓ పి ఎస్ ను అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ, ఉపాధ్యాయుల ఉన్నత విద్యకు సంబంధించిన సెలవులు మంజూరును జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం అప్పగించాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
