Tuesday, April 21, 2026
HomePoliticsAndhra Pradeshఎగ్ డౌన్...!

ఎగ్ డౌన్…!

పడిపోయిన గుడ్డు ధర

యుద్ధంతో నిలిచిపోయిన ఎగుమతులు

నెక్ రేటు రూ. 4.50, మార్కెట్ లో రూ 3.30కే

ఇరాన్‌, ఇజ్రాయెల్- అమెరికా దేశాలు గతవారం రోజులుగా పరస్పరం దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఫలితంగా పశ్చిమాసియా రగులుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, ఆయన కుటుంబసభ్యులు, కీలక నాయకులు చనిపోయారు. దీంతో ఇరాన్ ప్రతీకారం కట్టలు తెంచుకుంది. గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులతో విరుచుకుపడుతోంది. కారణంగా ఎక్కడికక్కడ విమానాలు నిలిచిపోయాయి. ఎగుమతులు దిగుమతుల వ్యవస్థ దెబ్బతింది. దాని ప్రభావమే పౌల్ట్రీ రంగంపై తీవ్రంగా పడింది.
దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ కోడిగుడ్డు ఎగుమతులు నిలిచిపోయాయి. తద్వారా పౌల్ట్రీ పరిశ్రమకు రోజుకు 5 కోట్ల నష్టం వాటిల్లుతోంది. దీనికి పోర్ట్‌లు, ఎయిర్‌పోర్టుల మూసివేతే ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ ధర నాలుగు రూపాయల యాభై పైసలుగా.. ఉండగా.. స్థానిక మార్కెట్లలో రూ.3.30కి పడిపోయింది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల మార్కెట్‌పైనా ప్రభావం పడింది. భారతదేశం నుండి గల్ఫ్ కంట్రీస్‌కి ప్రతిరోజూ సుమారు 10 మిలియన్ గుడ్లు ఎగుమతి అవుతాయి. ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్ వంటి మధ్యప్రాచ్య దేశాల్లో భారతీయ గుడ్లకు అతిపెద్ద మార్కెట్లు ఉంది. గత సంవత్సరం భారతదేశం టేబుల్ ఎగ్ ఎగుమతుల ద్వారా రికార్డు సుమారు 91 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. అయితే గత ఫిబ్రవరిలో సౌదీ అరేబియా ప్రజారోగ్య కారణాల దృష్ట్యా భారత్‌తో సహా 40 దేశాల నుండి కోళ్లు, గుడ్ల దిగుమతిపై పూర్తి నిషేధం కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. అయితే దేశం మొత్తం ఎగుమతుల్లో తమిళనాడు నమక్కల్ ఎగ్ మార్కెట్‌ నుంచి 95 శాతం ఉండటంతో అక్కడ తీవ్ర ప్రభావం చూపుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments