Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshచొప్పల్ల లాకుల వద్ద ‘టార్టాయిస్’ టేకాఫ్… రాజ్ తరుణ్ రొమాన్స్‌కు ప్రకృతి రైన్ ఎఫెక్ట్

చొప్పల్ల లాకుల వద్ద ‘టార్టాయిస్’ టేకాఫ్… రాజ్ తరుణ్ రొమాన్స్‌కు ప్రకృతి రైన్ ఎఫెక్ట్

అందాల హరివిల్లుగా పేరొందిన ఆలమూరు మండలం చొప్పల్ల లాకుల వద్ద సినీ సందడి నెలకొంది. హీరో రాజ్ తరుణ్, నూతన నటి అమృత చౌదరి జంటగా నటిస్తున్న తాజా చిత్రం టార్టాయిస్ షూటింగ్ ఇక్కడ ఉత్సాహంగా సాగింది. సహజ సౌందర్యానికి మరింత ఆకర్షణగా వర్షం సెట్టును ఏర్పాటు చేసి కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. లాకులపై వర్షంలో మేకల మందతో కలిసి నడిచే దృశ్యాలు, పిల్లలతో సందడి, అరక సెట్టుపై ముచ్చట్లు, బైక్‌పై జంట ప్రయాణం వంటి సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నర్సిపూడి గ్రామానికి చెందిన సుమారు 50 మంది బాలబాలికలు షూటింగ్‌లో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. దర్శకుడు కె. రిత్విక్ కుమార్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఎస్‌కె గోవర్ధన ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్‌ప్రైజెస్, ఎన్వీఎల్ క్రియేషన్స్, చందమామ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ, రవి కాలే తదితరులు నటిస్తుండగా చంద్రబోస్ పాటలు రాశారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments