Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradesh"జయజయహే" తెలుగు దినపత్రిక క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించిన మేడపాటి షర్మిలా రెడ్డి

“జయజయహే” తెలుగు దినపత్రిక క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించిన మేడపాటి షర్మిలా రెడ్డి

రాజమహేంద్రవరం: ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, రుడా మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నాయకురాలు మేడపాటి షర్మిలా రెడ్డి గురువారం రాజమహేంద్రవరం నగరంలో “జయజయహే” తెలుగు దినపత్రిక నూతన క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు నిజమైన, నిష్పక్షపాత వార్తలను అందించడంలో “జయజయహే” దినపత్రిక విశేష పాత్ర పోషిస్తున్నదని ప్రశంసించారు. ప్రజాస్వామ్యంలో మీడియాకు ఉన్న ప్రాధాన్యతను గుర్తుచేస్తూ, ప్రజల సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువచ్చే పాత్రను మీడియా పోషించాలన్నారు. స్థానిక అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందుతున్న జయజయహే దినపత్రిక మరింత ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జయజయహే దినపత్రిక రాజమహేంద్రవరం ప్రతినిధి బి.సంగీతరావు స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణను విజయవంతం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments