ఎంపీడీవో ఎన్ వి హెచ్ సీతారామస్వామి, ఎంపీపీ గాడి కాసులమ్మ బుధవారం చోడవరం యు పి మెయిన్ స్కూల్ ,గర్ల్స్ స్కూల్ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ మధ్యాహ్నం భోజనం పరిశీలించి రుచి చూశారు. మధ్యాహ్నం భోజనం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు స్కూల్లో విద్య బోధన ఎలా జరుగుతోంది అన్న విషయాన్ని పరిశీలించారు. వీరితో ఎంపీటీసీ శ్రీ.కొట్టాపురూపాదేవి అధికారులు ఉన్నారు.
