Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradesh“పోషణే బలమైన భవిష్యత్తుకు బాట – ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్”

“పోషణే బలమైన భవిష్యత్తుకు బాట – ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్”

రాజమహేంద్రవరం నగరంలో జరిగిన పోషణ్ పఖ్వాడా కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లుల పోషణ కీలకమని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు సరైన పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండి పాలు, గుడ్లు, పప్పులు, ఆకుకూరలు వంటి ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. “ఆరోగ్యమే మహాభాగ్యం” అని పేర్కొంటూ, ప్రతి కుటుంబం పోషకాహారంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments