కనక మహాలక్ష్మి గుడి నుండి వినాయక ఆలయం వరకు పాదయాత్ర
` అంతం జరగకుండా ఉండాలని వాసుపల్లి ప్రార్థనలు
పచ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికా – ఇరాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో అమెరికా మంగళవారం రాత్రి దేశాన్ని తుడిచిపెడతానని బెదిరించడం విచారకరమన్నారు. ట్రంప్ నిర్ణయంలో మార్పు రావాలని కోరుతూ వాసుపల్లి గణేష్ కుమార్ మంగళవారం రాత్రి పాత నగరం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కొబ్బరికాయ కొట్టి ఆసీలమెట్ట శ్రీ సంపత్ వినాయక ఆలయం వరకు చెప్పులు లేకుండా కాలినడకన వైసిపి శ్రేణులతో కలిసి శాంతియాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా జనరల్ సెక్రటరీ గనగల రామరాజు,వార్డ్ ప్రెసిడెంట్స్ పీతల వాసు, ముజీబ్ ఖాన్, ఎస్సీ సెల్ సెక్రెటరీ ఆరుగుల రాజు, జిల్లా యూత్ జనరల్ సెక్రెటరీ చంద్రమౌళి, సౌత్ అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు బాబ్జి, దైవ కుమార్, వీటి కృష్ణ కుమార్, వార్డ్ యూత్ ప్రెసిడెంట్లు చేపల నూకరాజు బూరెల చిన్న, లోకేష్,ఉదయ్,మౌళి తదితరులు పాల్గున్నారు
